Launchorasince 2014
← Stories

Gongura...


నాకు నచ్చని కూర - మా కుటుంబం మెచ్చే కూర

పొద్దున్నే తోపుడుబండిలో గోంగూర అమ్ముకునేవాడి కేకతోనే నా ఉదయం మొదలు...

వాడ్ని నాలుగు తిట్టుకుని మళ్ళీ నిద్రలోకి జారుకునే సమయంలో,అమ్మాయ్.....అని మా అమ్మ కేక...గోంగూర కొనుక్కురా అని...నన్ను లేపుతూనే,గోంగూరా...,గోంగూరబ్బాయ్....అని ఇంకో కేక...ఇంకేం నిద్ర?నాశనం...

అయిష్టంగానే నిద్రలో తూలుతూ ఆ గోంగూర కొనడానికి వెళ్తుంటే మళ్ళీ ఇంకో కేక....అమ్మాయ్...,మంచివి తీసుకురా ,చూసి అని...మా అమ్మ..

వాడేమో అన్నీ మంచివేలేమ్మా అనడం...దేవుడా ఏంటి నాకీ గోంగూర బాథలు...

అసలే చిరాకు ఆ గోంగూర అంటే నాకు,దానికి తోడు తెల్లారుతుండగా గోంగూర...వాటిని కోయాల్సింది కూడా నేనే ....అంతటితో అయిపోలేదు మళ్ళీ దాన్ని రోటీ పచ్చడి కర్త ,కర్మ ,క్రియ నేనే....

వారానికి మూడురోజులు గోంగూర...వాటిని గోంగూర రోజులుగా ప్రకటించాను...ఆ రోజుల్లో నేను పాక్షిక ఉపవాసం...

రోటీ పచ్చడి చేస్తున్నప్పుడు గోంగూరపైన నా కక్ష మొత్తం తీర్చుకుని మరీ నూరి మా అమ్మ చేతికిస్తే ,గోంగూర నువ్వే బాగా చేస్తావ్ అమ్మాయ్ అని కొంటెగా నవ్వుతుంటే...........,

నా జీవితం............అని నాలుగు తిట్లు నన్ను నేనే తిట్టుకుని..."యాంటీ గోంగూర ఫాన్స్ అసోసియేషన్ "(AGFA) మొదలెడుతున్నా......bless me..

I HATE GONGURA.....I HATE GONGURA.....

                                                                                       (Pen Name)

                                                                                        Isha Nanda