Launchorasince 2014
← Stories

jeevitham oka kavitha kadhaa! (telugu)


పుట్టుక నుంచి చావు వరకు జీవితం ఒక కవిత్వం , నమ్మవా?

పుట్టినప్పుడు నువ్వు ఏడ్చే ఏడుపు మీ అమ్మ నాన్న లకు సంగీతం అట!

గోరు ముద్దలు తినిపించు వేల ఎక్కడో ఉన్న చందమామను, చందమావా రావే గోకు పూలు తేవేఅని అంటామే!

మారం చేస్తున్న వేల భూచాడు వస్తాడని భయపెడతామే!

అల్లరి పిల్లల చేష్టలను వెన్న దొంగతో పోలుస్తామే !

చిట్టి పొట్టి అడుగులు , ఆ మాటలు చూసి మురిసిపోతామే !

బాల వాక్కులు బ్రహ్మ వాక్కులు అని మేచుకున్టమే !

నవ యవ్వనం లో కన్నె పిల్లల సోయగాన్ని జాబిలమ్మ తో పోలుస్తామే ,ఆ తేనె కులుకుల వయ్యారాన్ని తుమ్మెదల తో పోలుస్తామే , కనులు కలువ పువ్వులనీ , తనువు తామరమనీ,కురులు కారుమబ్బులనీ ,యెన్నెన్నో  వాటితో పోలుస్తామే !

యవ్వనాన నీ ప్రియురాలు మురిపేలని బహు సుందరంగా వర్నిమ్చేధవే !

సంసారాన్ని ఒక సంద్రం లా , సంసార జీవితాన్ని ఒక నావలా చెప్పుకున్టమే !

భార్యను మేనిలో సగ భాగమనీ , చితి వరకు తనే నీ సర్వస్వం అనీ అనుకున్తూ జీవిస్తమే!

ఏమయ్యా మనకు తెలియదా ఇవ్వన్నీ అతిశయోక్తులు అనీ ?

అతిశయోక్తిని అందంగా చెప్పగలిగింది కవిత కాకపొతే ఏంటయ్యా ?

కవిత కెధీ కాదు అనర్హం అన్న శ్రీ శ్రీ మాటలే కాదు జీవితమే కవితన్న నా మాట వినవయ్య.